24-07-2025 03:06:07 PM
తుంగతుర్తి(విజయక్రాంతి): తెలంగాణ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గురువారం నాడు మంత్రుల నివాసంలో కలిశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను మంత్రి కోమటిరెడ్డికి అందజేశారు.
1) అర్వపల్లి మండలంలోని NH -365 నుండి బొల్లంపల్లి గ్రామం వరకు బీటీ రోడ్డు .
2) బీటీ రోడ్డు అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం నుండి జానకిపురం గ్రామం వరకు
3) బీటీ రోడ్ శాలిగౌరారం మండలం రామగిరి గ్రామం నుండి గురుజాల గ్రామం వరకు.
4) తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి నూతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కోసం ప్రతిపాదించడం జరిగింది.
5) మోత్కూర్ మండలానికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జ్ దాదాపు 300 మీటర్లతో బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనితో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.