27-08-2025 02:14:21 AM
శ్రీకృష్ణ చాముండేశ్వరి స్వామి
ముషీరాబాద్, ఆగస్టు 26(విజయక్రాంతి): గత నాలుగు దశాబ్దాలుగా పర్యా వరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజిద్దాం మహాగణపతిని పూజిద్దాం అన్న నినాదంతో విద్యార్థిని విద్యార్థులకు, తల్లిదండ్రులకు శ్రీ చాముండేశ్వరి పీఠం ఆధ్వర్యం లో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వరి స్వామి తెలిపారు. ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్ర ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని వివిధ పాఠశాలల్లో పర్యావరణ అవగాహన సదస్సులు, మట్టి గణపతి పంపిణీ కార్యక్రమా న్ని నిర్వ హించారు.
అంతర్జాతీయ పర్యావరణ వేత్త సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ సంస్థ గ్లోబల్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ పర్యావరణ పరిరక్షణ మహా ఉద్యమంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిందని చెప్పారు.
ఖైరతాబాద్ భారీ గణపతి విగ్రహం వద్ద 2017 నుండి మట్టి గణపతిలే ముద్దు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు అన్న భారీ ర్యాలీని ఏర్పాటు చేసి ఖైరతాబాద్ ఉత్సవ సమితికి విజ్ఞప్తి చేయడం మూలంగా ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కార్యక్రమాలు మహాగణపతి విగ్రహాన్ని కూడా మట్టితోనే ఏర్పాటు చేయడంపై ప్రపంచ పర్యావరణ సంస్థ కృషి అభినందనీయమన్నారు. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ గణపతి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు ఆనందంగా పండుగ జరుపుకుంటూ పర్యా వరణాన్ని పరిరక్షించా లన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞాన భారతి హై స్కూల్ కరస్పాండెంట్ వై. అశోక్ కుమార్, రిజ్వాన్, ప్రమోద్ కుమార్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.