27-08-2025 02:15:13 AM
- అడిగినంత ఇచ్చుకో పర్మిషన్ పుచ్చుకో
- చుట్టూ ప్రభుత్వ పాఠశాలలు
- ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఎలా ?
- మండల స్థాయి అధికారికి వాటా?
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 26, (విజయక్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యను అభివృద్ధి పథం లో నడిపేందుకు కృషి చేస్తుంటే, మండల స్థాయి విద్యాధికారులు ఆమ్యామ్యాలకు అ లవాటు పడి నిబంధనలను తుంగలో తొక్కి ఇబ్బడి ముబ్బడిగా ప్రవేట్ పాఠశాలలకు అనుమతులు కట్టబెడుతున్నట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.
జిల్లాలో గత మూడేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా చుం చుపల్లి మండలంలోని చైతన్య పాఠశాలను తాజాగా అనుమతులు లేవంటూ డిఇఓ సీ జ్ చేసిన విషయం విధితమే. ఆ పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా 1వ తరగతి నుంచి ఏడవ తరగతి 5వ తరగతి వరకు మూడేళ్లుగా కొనసాగింది. అదే తరహాలో పాల్వంచ పట్టణ పరిధిలో పూర్తిస్థాయి అనుమతులు లేకుండా నారాయణ ఇంగ్లీష్ మీడి యం పాఠశాల కొనసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి.
ఆ పాఠశాల చుట్టూ ప లు ప్రభుత్వ పాఠశాలలు ఉన్న, ఓపెనింగ్ పర్మిషన్ సమయంలో ఆ పాఠశాలల నుంచి ఎన్‌ఓసి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది నుంచి అనుమతులు ఉంటున్నాయని చెబుతున్న ఎంఈఓ అనుమతుల పత్రాన్ని బహిర్గతం చేయక పోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఆ పాఠశాలకు మండల ఎంఈఓ కు వాటా ఉన్నట్టు ఆరోపణలు సైతం వెలబడుతున్నాయి. జిల్లా స్థా యి అధికారులను తప్పుదోవ పట్టించి ఎంఈఓ నే పాఠశాల యదేచ్ఛగా నిర్వహించేందుకు సహకరిస్తున్నారని తెలుస్తోంది.
నిబంధనలు ఇలా
ప్రవేట్ పాఠశాల ఏర్పాటుకు ప్రధానంగా సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి ఎన్‌ఓసి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏర్పాటు చేస్తున్న ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వ పాఠశాల కనీసం మూడు కిలోమీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉంది. పక్క పాఠశాల నుంచి ఎన్‌ఓసీ రానీ పక్షంలో పాఠశాలకు అనుమతులు నిరాకరించాల్సి ఉంది. దీంతోపాటు మున్సిపాలిటీ, పోలీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు తప్పనిసరిగా పొంది ఉండాలి.
పాల్వంచలో ఏర్పాటుచేసి న నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల చుట్టూ 300 మీటర్ల పరిధిలోనే మూడు ప్ర భుత్వ పాఠశాలలు నిర్వహించబడుతున్నా యి. వికలాంగుల కాలనీ ఉన్నత పాఠశాల, రాతి చెరువు బంజరస్ ఉన్నత పాఠశాల, గిరిజన ప్రాథమిక పాఠశాల అతి సమీపంలోనే ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి నారాయణ పాఠశాల పూ ర్తిస్థాయి అనుమతులపై విచారణ నిర్వహించాలని, ఇలాంటి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపై దృష్టి చారించాలని విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలకు అనుమతిలు ఉన్నాయి
నారాయణ పాఠశాలకు అనుమతులు ఉన్నాయని పాల్వంచ మండల విద్యాధికారి సమాధానమిస్తున్నారు. గత ఏడాది నుంచి అనుమతులు ఉన్నాయంటున్నారు తప్ప అనుమతుల పత్రాన్ని బహిర్గతం చేయకుండా దాట వేయడంతో అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి.
ఎంఈఓ శ్రీరామ్ మూర్తి