calender_icon.png 30 January, 2026 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లీన్ బడంగ్‌పేట్‌పై ప్రత్యేక దృష్టి

30-01-2026 02:16:49 AM

పారిశుద్ధ్యం బాధ్యత మనందరిది :- డీసీ సరస్వతి

బడంగ్‌పేట్ జనవరి 29 (విజయక్రాంతి): బడంగ్‌పేట్ కార్పొరేషన్ను చెత్త రహిత ప్రాంతంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ కమిషనర్ పి. సరస్వతి స్పష్టం చేశారు. గురువారం సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించి, సిబ్బందితో కలిసి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్  నిర్వహించారు. డీసీ సరస్వతి పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న వ్యర్థాలను దగ్గరుండి తొలగింపజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ ఎం. అభినయ్ కుమార్, ఏఈ గంగ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ యాదగిరి, పర్యావరణ ఇంజనీర్ రాము మరియు ఇతర వార్డు అధికారులు పాల్గొన్నారు.