calender_icon.png 4 November, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల సత్వర పరిష్కారానికి న్యాయధికారులతో సమన్వయం తప్పనిసరి

01-11-2025 04:44:33 PM

ఈ నెల 15వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా పోలీసు అధికారులు, కోర్ట్ డ్యూటీ అధికారుల సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటించే పరిష్కరించాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజీపడదగిన కేసులలో ఇరు వర్గాల వారి నిర్ణయాలతో కొన్ని కేసులను ఈ నెల 15వ తేదీన జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్ నందు పరిష్కరమయ్యేలా కృషి చేయాలన్నారు. చిన్న చిన్న విషయాలకు కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగడం కన్నా రాజీ పడటమే ఉత్తమమని కక్షిదారులకు వివరిస్తూ అట్టి కేసులను పరిష్కారం దిశగా తీసుకెళ్లాలని తెలిపారు. 

క్రిమినల్ కేసుల్లోని నిందితులకు కేసుల తీవ్రతను బట్టి త్వరితగతిన శిక్షలు పడేలా చేసి కన్వీక్షన్ రేటును పెంచాలని కోరారు. ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలో ఉన్నతాధికారుల సలహాలతో ముందుకెళ్లాలని సూచించారు. భాదితులకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేసుల పరిష్కారం విషయాలలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పీ చంద్రభాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి,సీఐ శ్రీనివాస్ , జిల్లాలోని సీఐలు,ఎస్సైలు,కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.