08-09-2025 12:00:00 AM
మణుగూరు, సెప్టెంబర్ 7,( విజయక్రాంతి) : మణుగూరు అటవీ డివిజన్ పరి ధిలోని అడవుల సంరక్షణతో పాటు, వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టా లని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన సంరక్షణాధికారి డా. సువర్ణ పేర్కొన్నారు. అటవీ అభివృ ద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆదివారం ఆమె సీసీఎఫ్ (చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) డా.బీమానాయిక్, జిల్లా అటవీ అధికారి కృష్ణగౌడ్ తో కలిసి మణుగూరులో పర్యటించారు.
రథంగుట్ట అటవీ ప్రాంతం లో కలియతిరుగు తూ చెట్లు, మొక్కలను పరిశీలించి, అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల వివరాల అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం పగిడేరు. గ్రామంలోని వేడినీటి బోరును సందర్శించి, సెకండ్ ఫారెస్ట్ బ్లాక్లో ప్లాంటేషన్స్ లో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ. అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు, పె ద్ద ఎత్తున మొక్కలునాటినట్లు, చెట్లు నర క కుండా, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మని చెప్పారు. ర ధంగుట్ట అర్బన్ పార్కునుటూరిజంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్ల డించారు.
అనంతరం సింగరేణి గెస్ట్ హౌస్ లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం దుర్గం రాంచందర్,అధికారులతో సమావేశమై వన్య ప్రాణి సంరక్షణ, సింగరేణి ప్రాంతం లో చేపటిన అటవీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్య క్రమంలో ఎఫ్డీవో మక్సూద్, ఎఫ్ ఆర్ ఓ ఉపేంద్ర, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.