02-01-2026 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, జనవరి 1 (విజయ క్రాంతి): తాగునీటి పనుల నిమిత్తం మూడవ తేదీన మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో అవగాహన సమావేశం ఉంటుందని మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. కావున మండలంలోని నూతన సర్పంచులు, కార్యదర్శిలు ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు. అలాగే గ్రామాలలో 200 గజాలలో మహిళా మండల బిల్డింగ్ల నిమిత్తం మరియు ఇందిరమ్మ ఇండ్లు చర్చించడం ఇందిరమ్మ ఇండ్లు మంజూరై కట్టుకొని స్థితిలో ఉన్నటువంటి వారికి కాంట్రాక్టర్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని మండల ఇంచార్జ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.