calender_icon.png 7 November, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్తీక పౌర్ణమి రోజున శ్రీనాగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

06-11-2025 12:00:00 AM

ములుగు,మంగపేట,నవంబరు5(విజయక్రాంతి):ములుగు జిల్లా మంగపేట మం డలంలోని లక్ష్మీనర్సాపురం గ్రామంలో కార్తీ క పౌర్ణమి సందర్భంగా శ్రీనాగులమ్మ ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తీక పౌర్ణమి రోజునాడు భక్తులు గోదావరి నది స్నానము పురస్కరించుకుని, ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగులమ్మ పుట్టకు పాలు పోసి పూలు ఫలాలతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న నవనాగులకు ,కంకవనం పుట్టకు భక్తులు పూజలు నిర్వహించి  శ్రీనాగలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని దీపాలు వెలిగించారు. శ్రీనాగులమ్మ ఆలయంలోకి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ తెలిపారు.