calender_icon.png 7 November, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దూసుకెళ్తున్న మాగంటి కుటుంబం

06-11-2025 12:00:00 AM

జూబ్లీహిల్స్‌లో ఇంటింటి ప్రచారం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపే లక్ష్యంగా ఆమె కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యూసఫ్‌గూడ డివిజన్ పరిధిలోని వెంకటగిరిలో మాగంటి సునీతగోపినాథ్ బుధవారం ఇంటింటి ప్ర చారం నిర్వహించారు.

స్థానిక కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు నీలం సంతోష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఆమెకు మద్దతుగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, సీతాఫల్‌మండి కార్పొరేటర్ సామల హేమ, కంటోన్మెంట్ మాజీ ఎమ్మె ల్యే అభ్యర్థి నివేదిత సాయన్న ప్రచారంలో పాల్గొన్నారు. బోరబండ డివిజన్‌లో 342, 343 బూత్‌ల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి.. మాగంటి గోపినాథ్ కుమార్తెలతో కలిసి ప్రచారం చేశారు.