05-05-2025 02:15:25 AM
ఆమనగల్లు, మే 4: అమనగల్లు వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రం లో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. శనివారం కురిసిన అకాల వర్షానికి కొ నుగోలు కేంద్రంలో ఆరబోసిన వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన కు దిగారు. తేమ శాతం పేరిట కొనుగోలు లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని...
సరిపడా గన్ని బ్యాగులు, టార్పాలి న్ కవర్ల కొరత ఉందని రైతులు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే రైతులు ఎవరు ఆందోళన గురి కావోద్దని తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా నాలుగు కాంటాలను ఏర్పాటు చేయాలని, హామాలీల సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆకాల వర్షాల కారణంగా మార్కెటు కు తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి టార్పాలిన్ల కవర్లు, గన్ని బ్యాగులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని ఆయన సూచనలు చేశారు.