05-05-2025 02:12:57 AM
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, మే 4 : బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభి వృద్ధి చెందుతుందని, కేసీఆర్ ఆధ్వర్యంలోనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఎ మ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నా రు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఫేజ్ - 4 ఆర్చి వద్ద బీఆర్‌ఎస్ నాయకు డు, ఉద్యమకారుడు దూస రి మధుగౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులతో యువకులు ఆదివారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ కోతలు లేవని, కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు కరెంట్ పోతుందో అర్థం కావడం లేదన్నారు.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ విధివిధానాలు నచ్చక బీఆర్‌ఎస్‌లో చేరుతు న్నట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంస్కారం మరచి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మాటలతో రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్, నాయకులు మల్లేశ్ గౌడ్, చాపల శ్రీనివాస్, ఆనంద్ రాజ్, మిట్ట రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ లో చేరినవారిలో పులి వేణు, యాదగిరి, సుమన్ రెడ్డి, హరి నాయుడు, చంద్రశేఖర్, పూర్ణా గౌడ్, శ్రీధర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.