19-07-2025 12:00:00 AM
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
నిజాంసాగర్ జూలై 18(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను వేగవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నాడు నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మండ్ల నిర్మాణా లను వేగవంతం చేసేందుకు కార్యదర్శిలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంటి నిర్మాణాలకు ఇసుక ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆమె సూచిం చారు. వనమహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి గంగాధర్. తాసి ల్దార్ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.