calender_icon.png 27 August, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయం దిశగా శ్రీలంక

29-09-2024 12:00:00 AM

గాలె:  సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంక విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడుతున్న న్యూజి లాండ్ 5 వికెట్లు కోల్పోయి పరాజ యం దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆట ముగిసేసరికి న్యూజిలాం డ్ రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.