27-01-2026 01:27:54 AM
ఆరోహణ్ 2026 పేరుతో పాఠశాల కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, జనవరి 26: శ్రీత్రివేణి పాఠశాల తన 38వ వార్షికోత్సవాన్ని ఆరోహణ్ 2026 రైజింగ్ టు న్యూ హైట్స్ అనే శీర్షికతో చంపాపేటలోని మినర్వా గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్య్ర కమానికి విశిష్ట అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా డాక్టర్ వి. సరళ, టెక్నాలజీ డైరెక్టర్, ఆర్సీఐ, డీఆర్డీఓ హాజరయ్యారు.ఆమె తన ప్రసంగంలో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణ, క్రమశిక్షణ, పట్టుదల వంటి విలువలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు పెద్ద కలలు కని, అంకితభావంతో, నిజాయితీతో కృషి చేయాలని సూచించారు.
గౌరవ అతిథులుగా శ్రీనివాసులు సిరంథాస్, ప్రిన్సిపాల్, కాలేజ్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్),రాజు కీర్చిపల్లి, కో-ఫౌండర్, ఇన్ఫోర్టెకార్ప్ సొల్యూషన్స్ లిమిటెడ్, లండన్ (యూకే), హాజర య్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా సంగీత దర్శకురాలు ఏజే సంధ్య వర్షిణి,గేయ రచయిత,జానపద గాయకుడు సంపత్ కుమార్ హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ కార్యక్రమానికి జిట్టా సురేందర్ రెడ్డి, చైర్మన్, కె. గోవర్ధన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, శ్రీ త్రివేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధ్యక్షత వహించగా, శారద, ప్రిన్సిపాల్ ఆధ్వర్యం లో ఈ వేడుకలు నిర్వహించారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.