15-11-2025 07:39:21 PM
బీజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి..
మానకొండూర్ (విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పేదలకు అండగా ఉండేందుకు ఎల్లప్పుడూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరాటపడుతుంటారని బీజేపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మోదీ గిఫ్ట్ పేరిట బండి సంజయ్ 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నటువంటి సైకిల్ లను శనివారం పర్లపల్లి పాఠశాలలో విద్యార్థులకు 18 సైకిళ్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారంతా పేద విద్యార్థులేనని అన్నారు. వారికి సైకిల్ కొనడమనేది ఆర్ధికంగా భారం అనే విషయం దృష్ట్యా వారికి సైకిల్ లను ఉచితంగా అందిస్తే చదువు మానేయకుండా ఉంటారనే ఉద్దేశ్యంతోనే సైకిల్ లను ఇస్తున్నట్లు తెలిపారు.
సైకిల్ లతో పాటుగా పరీక్ష ఫీజులు కూడా చెల్లించడమనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టెందుకు బండి సంజయ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం దేవరాజం, బిజెపి మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఐల రాజశేఖర్, సీనియర్ నాయకులు కరివేద జగన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, పిట్టల మహేష్, గట్టు రాజు, తదితరులు పాల్గొన్నారు.