18-09-2025 12:03:27 AM
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ (విజయక్రాంతి): కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం కంటోనమ్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని, విలీనం ఆలస్యం అయితే ఎన్నికలన్నా నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీగణేశ్ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. బోర్డుకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పరిపాలన మూలన పడిందని, ప్రజల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని అన్నారు.
బుధవారం హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యతో పాటు కంటోన్‌మెంట్ నియోజకవర్గంలో నివసిస్తున్న పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలని, పేదలు నివసిస్తున్న భూములను బదలాయింపు చేసి ఆ భూములను ఫ్రీ హోల్ చేయాలని ఎమ్యెల్యే శ్రీగణేశ్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.అలాగే కేంద్ర ప్రభుత్వం కంటోన్‌మెంట్ బోర్డు కు చెల్లించాల్సిన వెయ్యి కోట్ల ఆర్మీ చార్జీలను వెంటనే విడుదల చేయాలని కోరారు.