calender_icon.png 24 September, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటర్ డ్యామ్ స్కూల్లో 4వ రాష్ట్రస్థాయి రోప్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు

24-09-2025 12:58:18 AM

ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : నారపల్లి సమీపంలోని రోటర్ డ్యామ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో 4వ రాష్ట్రస్థాయి రోప్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు తెలంగాణ రోప్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించారు. ఈ పోటీలలో రూటర్ డ్యాం ఇంటర్నేషనల్ స్కూల్, కెవిఎస్ ఉప్పల్, బోయిన్ పల్లి, ఖమ్మం, దేవేంద్ర విద్యాలయం, పల్లవి మోడల్ స్కూల్, మేరీడి ఎన్ స్కూల్, మరియు సేజ్ స్కూల్ ల నుండి మొత్తం 268 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జక్కా వెంకట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జిపిసి శేఖర్ రాజు, పిఈటి స్పోరట్స్ సెల్ ఇంచార్జి సూర్యప్రకాష్, రోహిదాస్, తెలంగాణ రోప్ స్కిప్పింగ్ జనరల్ సెక్రెటరీ భాను ప్రకాష్, కరుణాకర్ రెడ్డి, రోటర్ డ్యాం స్కూల్ డైరెక్టర్ జి. శ్వేతారెడ్డి ప్రిన్సిపాల్ కె. రూపా రెడ్డి పాల్గొన్నారు.

ఈపోటీలలో రోటర్ డ్యాం ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి ఛాంపియన్ షిప్ ను అందుకున్నారు. ద్వితీయ స్థానంలో దేవేంద్ర విద్యాలయ నిలువగా తృతీయ స్థానంలో మేరీ డీఎన్ విద్యార్థులు నిలిచారు. వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ పోటీలలో గెలిచిన విద్యార్థులు హైదరాబాద్ లో జరగబోయే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారు.