calender_icon.png 27 January, 2026 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌యూబీ, ఆర్‌ఓబీల నిర్మాణానికి చర్యలు

27-01-2026 12:43:54 AM

ఎంపీ ఈటల రాజేందర్ 

మేడ్చల్, జనవరి 26 (విజయ క్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఆర్ యు బి, ఆర్‌ఓబి ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం ఈస్ట్ ఆనంద్ బాగ్ కమ్యూనిటీ హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెం డింగ్‌లో ఉన్న వాటితో పాటు కొత్త వాటిని కూడా నిర్మించనుందన్నారు. రైల్వే ప్రాజెక్టులు సత్వరం పూర్తి కావాలనే ఉద్దేశంతో 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేస్తుందన్నారు.

బొల్లారం వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని స్థానికులు విన్నవించగా 1993లో మంజూర అయిందని, భూ సేకరణ జరిగి 30 ఏళ్లయిన అక్కడ ఆర్‌ఓబి నిర్మించలేదని, వాజ్పేయి నగర్‌లో కూడా శిలాఫలకం వేసి పనులు ప్రారంభించలేదన్నారు. ఆర్‌ఓబి, ఆర్ యుబిల విషయమై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. 27న షఫీలుగూడ, వాజ్పేయి నగర్‌లో ఆర్‌యుబిలకు భూమి పూజ చేయనున్నామన్నారు.

అంతేకాకుండా త్వరలో గుండ్లపోచంపల్లి, తుర్కపల్లి, జనప్రియ నగర్, మచ్చ బొల్లారం, లయోలా కాలేజ్, ఓల్ ఆల్వాల్ దగ్గర ఆర్‌ఓబి, ఆర్‌యుబిలకు టెండ ర్లు వేసి భూమి పూజ చేయనున్నామని ఆయ న తెలిపారు. కొంతమంది తామే నిధులు మంజూరు చేయించామని సోషల్ మీడియా లో ప్రచారం చేసుకుంటున్నారని, ఎవరు చేశారో ప్రజలు గమనిస్తున్నారన్నారు.