calender_icon.png 27 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యం

27-01-2026 12:42:34 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జనవరి26 (విజయక్రాంతి): యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే టోర్నమెంట్ల లక్ష్యమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఎల్.ఎన్ నగర్‌లోని పీజేఆర్ ప్లే గ్రౌండ్ లో నిర్వహిస్తున్న పి.జనార్దన్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి కాసేపు ప్రేక్షకులను అలరించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ క్రికెట్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, వ్యక్తుల మధ్య స్నేహ భావం పెంపొందుతుందన్నారు.పి.జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వాహకులను అభినం దించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.