17-09-2025 12:57:44 AM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మరిపెడ సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో మంగళవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ విజయ్ చందర్, స్థానిక తహసిల్దార్ కృష్ణవేణి లతో కలిసి మరిపెడ మండలంలో ప్రాథమిక సహకార సంఘం తరఫున చేస్తున్న ప్రక్రియను పారదర్శకంగా, రైతు భరోసా జాబితా ఆధారంగా ప్రతి ఒక్క రైతుకు యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం మండలంలోని గిరిపురం గ్రామంలో ఉన్న ఆదర్శంగా తనిఖీ చేశారు హాస్టల్లో డైనింగ్ హాల్ స్టోర్ గది పరిసరాలను పరిశీలించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం సూచించడం విధంగా బ్రేక్ ఫాస్ట్ ,లంచ్ ,డిన్నర్ ,వైద్య పరీక్షలు ,ప్రతి సబ్జెక్టు పై అవగాహన డిజిటల్ తరగతులు క్రీడా సాంస్కృతిక విభాగాలలో శిక్షణ అందించాలని సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, మండల వ్యవసాయ అధికారి వీరా సింగ్ తదితరులు పాల్గొన్నారు.