calender_icon.png 17 September, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి

17-09-2025 12:59:11 AM

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

హనుమకొండ టౌన్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల లో మంగళవారం సైబర్ క్రైమ్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం సిపి మాట్లాడుతూ సైబర్ నేరాలకు ఎవరు పాల్పడిన చట్ట ప్రకారం శిక్షించబడతారన్నారు.

సైబర్ నేరాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా ఇటీవల ఏఐ సాంకేతిక విధానం ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారన్నారు. యువత అమాయకంగా ఎవరిని నమ్మడం గాని, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు లోను కాకూడదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుంకరి జ్యోతి, కేయూ రిజిస్టర్ ప్రొఫెసర్ వీ రామచంద్రన్, సైబర్ క్రైమ్ ఎసిపి కే. గిరి కుమార్, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, నార్కోటెక్ ఇన్స్పెక్టర్ సతీష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మహబూబాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఫైబర్ నేరాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఇతరులకు అవగాహన పెంపొందించే విధంగా కృషి చేయాలని మహబూబాబాద్ పట్టణ సిఐ మహేందర్ రెడ్డి సూచించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యంగా విద్యాభ్యాసం చేయడం ద్వారా  ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఏ.బలరాం నాయక్, ఎస్ ఐ అశోక్, భవాని, అధ్యాపకులు పాల్గొన్నారు.