26-01-2026 01:19:19 AM
ఆదర్శ పాఠశాలలో.. వంటశాల నిర్మించేదెన్నడూ?
కేసముద్రం, జనవరి 25 (విజయక్రాంతి): పేరుకే ఆదర్శ పాఠశాల.. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా కిచెన్ షెడ్ నిర్మించకపోవడంతో మధ్యాహ్నం భోజనం వండి పెట్టే మహిళలు వంట చేయడానికి, విద్యార్థులు తినడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలలో వంట చేయడానికి కిచెన్ షెడ్, 400 మందికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడానికి డైనింగ్ హాల్ నిర్మించలేదు. వంట చేయడానికి, గిన్నెలు కడగడా నికి పూర్తి స్థాయి నీటి వసతి లేదు. మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ ఏదైనా అంతరాయం కలిగితే గ్రామపంచాయతీ నుంచి ట్యాంకర్ ద్వారా తెచ్చుకోవడం లేదం టే సమీపంలోని వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది.
వర్షాకాలంలో వండి పెట్టడానికి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీ మహిళలు సొంతంగా వంట సామాగ్రి, బి య్యం నిలువ చేసుకోవడానికి తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. వంట చెట్ల కిందనే ఆరుబయట చేస్తున్నారు. మ ధ్యాహ్నం భోజనం నిర్వాహకులు, విద్యార్థు లు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే డా క్టర్ భూక్యా మురళి నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా కిచెన్ షెడ్ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను మంజూరు చేసి, నిర్మాణ ప నులకు శంకుస్థాపన కూడా చేశారు. అయితే కిచెన్ షెడ్డు నిర్మించడానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో నిధులు మంజూరైనప్పటికీ కిచెన్ షెడ్డు నిర్మాణం నోచుకోలేదు. కిచెన్ షెడ్డు నిర్మాణంతోపాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమ స్యల పరిష్కారానికి ఎవరు ఆసక్తి చూపడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితో అరకొర సౌకర్యాల మధ్య మధ్యాహ్న భోజనం వండి పెట్టడం, తినడానికి తిప్పలు పడాల్సిన పరిస్థితి తొలగడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మోడల్ స్కూల్లో కిచెన్ షెడ్డు, డైనింగ్ హాల్, నీటి వసతి కల్పించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈ గోస తీరేది ఎప్పుడు?
మోడల్ స్కూల్ లో విద్యార్థులకు మధ్యాహ్నం భో జనం వండి పెట్టడానికి అరిగోస ప డాల్సి వస్తోంది. వర్షాకాలంలో ఇక మే ము పడే బాధలు చెప్పనలవి కానివి. పొ యిల కట్టెలు, వంట సామాగ్రి తడవకుం డా తలకొంత డబ్బులు సమకూర్చుకొని ప్లాస్టిక్ కవర్, రేకులతో తాత్కాలి కంగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నాము.
వర్షాకాలం వస్తే ఇక మా బాధలు వర్ణనాతీతం. వర్షంలో వంట చేయడం, పిల్లలు తినడానికి, మేము వాళ్లకు వండి వార్చడానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వ స్తుంది. ఇప్పుడు కడతాం అప్పుడు కడ తాం అంటూ హామీలతో దాటవేస్తున్నా రు తప్ప కిచెన్ షెడ్డు నిర్మించడం లేదు. వర్షాకాలానికి ముందే కిచెన్ షెడ్ నిర్మిం చి ఇబ్బందులు తొలగించాలి.
ముప్ప రేణుక, వంట ఏజెన్సీ మహిళ