calender_icon.png 19 October, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు

17-10-2025 12:00:00 AM

  1. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ సూచన
  2. పత్తి, సోయా కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష
  3. కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ 
  4. తేమ శాతంలో సడలింపు ఇవ్వాలి: ఎమ్మెల్యే అనిల్

ఆదిలాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల బంగారం (పత్తి), సోయా బీన్ పంటకొనుగోలు ప్రక్రియ పెద్ద ఎత్తున జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కొనుగోళ్లపై దృష్టి సారించా రు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారం పత్తి కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంక ర్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నా రు.

ఈ సందర్భంగా కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ... పత్తి కొనుగోలు ప్రక్రి య సజావుగా సాగేలా అధికార యం త్రాంగం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. మార్కెట్ యార్డులలో రైతుల కోసం మౌలిక వసతులతో పాటు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేస్తామన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామన్నారు.

పత్తి కొనుగోలు చేపట్టిన తర్వాత వారం లోపల రైతుల కు డబ్బులు అందేలా చూడాలని సీసీఐ అధికారులకు ఆదేశించారు. అటు పత్తి కొనుగో లు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తుకుండా యూనియన్ సభ్యులతో డీఎస్పీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించామన్నారు.

ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. యాప్ లో రైతులు తమ వివరాలను నమోదు చేసే క్రమంలో అధికారులు సైతం వారికి సహకరించాలని అన్నారు. నెట్వర్‌లు లేనిచోట సంబంధిత సంస్థలు సెల్ టవర్స్ ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు మరింత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతుల కోసమే ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు.

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ...  పత్తి తేమ శాతం విషయంలో సడలింపు కల్పించాలనీ అన్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. పలు గ్రామాల్లో ఇప్పటికే సరైన నెట్వర్ లు లేవని, కావున ఈ విషయంపై అధికారులు చర్యలుతీసుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో రైతులు ఎక్కడైనా పత్తి అమ్ముకునే విధంగా చూడాలన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వరరావు, ట్రైన్ కలెక్టర్ సలోని, పలువురు అధికారులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.