calender_icon.png 14 November, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్ఞాత దళ సభ్యులను కోర్టులో హాజరుపరచాలి

20-05-2024 01:18:11 AM

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19(విజయక్రాంతి): వరంగల్ పోలీసులు అరెస్టు చేసిన తమ పార్టీకి చెందిన అజ్ఞాత దళ నాయకులను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆరెల్లి కృష్ణ, వరంగల్ జిల్లా నాయకుడు నున్నా అప్పారావు డిమాండ్ చేశారు. ఈ నెల 18న రాత్రి 11.30 గంటలకు తమ పార్టీకి చెందిన అజ్ఞాత దళ నాయకులు ఆబర్ల రాజన్న, సిద్దబోయిన జీవన్, దేవిరెడ్డితో పాటు మరొకరిని వరంగల్ జిల్లా హస న్‌పర్తి మండలం ఆరేపల్లి సమీపంలో పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయాన్ని తెల పకుండా వారిని చిత్రహింసలకు గురిచేస్తూ, గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ, గిరిజన, గిరిజనేతర ప్రజల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా తమ పార్టీ పోరాడుతుందని గుర్తు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని, ఎటువంటి కేసు లు బనాయించకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.