23-06-2025 06:27:29 PM
జిల్లా సీఎంఓ రాంబాబు..
పెన్ పహాడ్: గ్రామీణ ప్రాంతాలలో సర్కార్ బడుల అభివృద్ధికి దాతలు సహకరించడం అభినందనీయమని జిల్లా సీఎంఓ రాంబాబు(District CMO Rambabu) అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ యూపీస్ పాఠశాల పూర్వ విద్యార్థి గద్దల సైదమ్మ- సైదులు దంపతుల కుమారుడు గద్దల స్వప్న- అశోక్ (ఎస్ఐ) రూ. 10 వేలు విలువగల సీలింగ్ ఫ్యాన్లు అశోక్ బావమరిది కొండేటి శ్రీను చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎంఓ రాంబాబు మాట్లాడుతూ... పాఠశాల యందు విద్యార్థులకు నాణ్యమైన బోధన ఉపాధ్యాయులు అందించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల యందు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పిండగ నర్సయ్య, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు మామిడి వెంకన్న, ఆదర్శ కమిటీ చైర్మన్ పందిరి రేణుక వీరస్వామి, గ్రామ కార్యదర్శి జానీ వర్మ, ఉపాధ్యాయులు కళ్యాణి, విజయ కుమారి, వై ఎంకన్న, విప్లవకుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.