calender_icon.png 9 August, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పక్కదారి పడితే డీలర్లపై కఠిన చర్యలు

09-08-2025 12:09:52 AM

నాగర్ కర్నూల్ ఆగస్టు 8 ( విజయక్రాంతి )ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే సన్న బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తే డీలర్లపై కఠినంగా వ్యవహరిస్తామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, స్థానిక ఎ మ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డిలు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రేషన్ కార్డులను నిరంతర ప్రక్రియ ద్వారా అందుతుందన్నారు.

కుటుంబ సభ్యుల్లో చేరిన వ్యక్తికి నూతన కార్డు వచ్చే అవకాశం లేదని కుటుంబ సభ్యుల్లో నుండి ఆ పేరును తొలగించడం వల్ల నూతన కార్డు మంజూర వుతుందని పేర్కొన్నారు. కొంతమంది డీల ర్లు సన్న బియ్యం ఇతర బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తమ దృ ష్టికి వచ్చిందన్నారు. వారితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు తదితరులు ఉన్నారు.