calender_icon.png 9 August, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్మికులను పీఆర్సీలో చేర్చాలి

09-08-2025 12:10:17 AM

 ములకలపల్లి, ఆగస్టు 8,( విజయ క్రాంతి):గ్రామ పంచాయతీ కార్మికుల ను రెండోవ పిఆర్సీ లోకి తక్షణమే చేర్చాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్, సిఐటియు నియోజకవర్గ కన్వీనర్ పిట్టల అర్జున్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రము లోని సిఐటియు కార్యాలయంలో చిక్కుల శ్రీను అధ్యక్షతన జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ వ ర్కర్స్ యూనియన్ మండల మహాసభ లో వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

గ్రా మ పంచాయతీ కార్మికులు ప్రజలు వాడుకొని పడేసిన వ్యర్ధాలను మురికి వాడలు, కాలువలను బయటకు తరలించే సమయంలో కార్మికులకు రక్షణ కిట్లు లేకపోవడం తో కార్మికులు అనేక అం టు వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేయాలని డి మాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనం తో కూడిన ఆదివారం,పండగ సెలవు లు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ప్ర భుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగు ల వలే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో ప్రభుత్వాలు మారినప్పటికీ గ్రామ పంచాయతీ కార్మికుల బ్రతుకులు మారలేదని కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరణించిన ప్రతి గ్రామ పంచాయతీ కార్మికుడికి రూ 10 లక్షల ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులుగా చిక్కుల శ్రీను, మండల ప్రధాన కార్యదర్శిగా గంట శ్రీనివాస లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు మరో 18 మందిని మండల కమిటీ సభ్యులుగా ఉపాధ్యక్షులుగా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు,గంటా శ్రీనివాసరావు,కారం రాజ్ కుమార్, వర్క రుక్మధరావు,వగ్గేల దారయ్య,కుంజా రాజు, మేకల రమేష్,దుబ్బ భాస్కర్,చనగాని వెంకన్న,కుంజా శ్రీను, కృష్ణ,పొక్కిలి నరేష్,గడ్డం రాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.