08-07-2025 01:14:05 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూలై 7 : జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమ వారం కలెక్టర్ సమావేశ మందిరంలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ లతో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఎ.సి.పి.లు ప్రకాష్, రవికుమార్, వెంకటేశ్వర్లు, తహశిల్దార్లు, అటవీ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణల నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అటవీ భూములను ఆక్రమి స్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ఏర్పా టు చేయడం జరిగిందని, అటవీ చట్టాలను ఉల్లంఘించి అటవీ భూముల ఆక్రమణ పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆక్రమణకు పాల్పడిన వారు ఎవరైనా సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వ హించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత శాఖ అధికారులను కోరారు.
ప్రజావాణిలో 35 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజావాణిలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డిఓ లు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో జిల్లా అధికారులు పాల్గొన్నారు.