calender_icon.png 8 July, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి ఉత్కృష్ట సేవా పతకానికి త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ ఎంపిక

08-07-2025 01:15:14 AM

సిద్దిపేట కలెక్టరేట్, జులై 7: త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 అతి ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డా. బి. అనురాధ ను కలిశారు. కమిషనర్ మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచే అధికారులను ప్రోత్సహించేందుకు రివార్డులు, అవార్డులు, సేవా పతకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ 25 సంవత్సరాల సేవలో ఒక్క రీమార్క్ లేకుండా విశిష్ట సేవలందించి ఈ గౌరవానికి అర్హత సాధించారనీ కొనియాడారు.