08-07-2025 01:13:29 AM
తూప్రాన్, జూలై 7 : గుర్తు తెలియని దొంగలు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులోని కాయిల్స్ ఆయిల్ దొంగిలించిన సంఘటన తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రైతులు సమాచారం అందించడంతో గ్రామస్తులకు విషయం తెలిసింది. తక్షణమే అక్కడికి చేరుకొని ట్రాన్స్ఫార్మర్నుపరిశీలించారు. వెంటనే అధికారులు మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని రైతులు కోరారు.