calender_icon.png 10 January, 2026 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

08-01-2026 12:16:14 AM

మానకొండూర్, జనవరి 7 (విజయ క్రాంతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక క్వారీ నిర్వహించాలని, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి పరిధిలోని ఎల్‌ఎండి రిజర్వాయర్ జలాల నుండి పూడికతీత, పూడిక నుండి ఇసుక వేరు చేసే విధానాన్ని, ఇసుక క్వారీ నిర్వహణను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్ట పరిమితికి మించి ఇసుక తరలించినా, కేటాయించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాలు క్వారీలోకి వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ లోడింగ్ వేయింగ్ సమయంలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక కేటాయింపు ఉండాలని, తనిఖీల్లో అక్రమాలు బయటపడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజిఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ వినయ్ కుమార్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిఈఈ శ్రీనివాస్, ఏఈఈ సంజన, ఏఈ వంశీధర్, తదితరులు పాల్గొన్నారు.