30-10-2025 10:01:13 PM
 
							పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ అన్నారు. గురువారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేపట్టారు, పలు వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రావణ్ కుమార్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.