calender_icon.png 12 July, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులపై పకడ్బందీగా సర్వే

09-07-2025 12:00:00 AM

నిర్వహిస్తున్నాం తాహసీల్దార్ శ్వేత 

తాడ్వాయి, జూలై 8 : భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై పకడ్బందీగా సర్వే నిర్వ హిస్తున్నామని తాడువాయి తహసిల్దార్ శ్వేత తెలిపారు. మంగళవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండ లం నందివాడ, సంగోజివాడి గ్రా మాల్లో భూభారతి దరఖాస్తులపై ఆమె అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూభారతి సర్వేలో రైతులకు న్యాయం చేయాల నే సంకల్పంతో ప్రతి దరఖాస్తును పరిశీలి స్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్‌ఐ మౌనిక,సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.