calender_icon.png 12 July, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో జర్నలిజం నాలుగో స్తంభం

09-07-2025 12:00:00 AM

రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ జూలై 8 (విజయక్రాంతి ): ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం అత్యంత కీలకమని నాలుగో స్తంభం లాగా పనిచేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) యూనియన్ నాలుగవ జిల్లా మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యానికి జర్నలిజం నాల్గవ స్తంభం లాగా పనిచేస్తుందని విలేఖరుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిసట్స్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ లు పనిచేస్తున్నాయన్నారు. జర్నలిజం నిర్భయంగా ఉండాలి. వాస్తవాలను వెల్లడించడమే జర్నలిస్టుల ధర్మం అని పేర్కొన్నారు.

జీతాలు లేని స్థితిలో పేదరికంలో జీవించే జర్నలిస్టులకు... ఇండ్లు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు న్యాయమైన డిమాండ్లే అని హామీ ఇచ్చారు. కానీ కొల్లాపూర్లో జర్నలిస్టుల పేరుతో జరుగుతున్న రాజకీయాలను ఆయన తీవ్రంగా ఖండించారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ...కత్తికంటే కలం గొప్పదని జర్నలిస్టులు నాయకులను సరిదిద్దగల శక్తి కలవారన్నారు.

ఇండ్ల స్థలాల విషయంలో పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ...ప్రపంచానికి దిశా నిర్దేశం జర్నలిస్టులదే. ఇలాంటి సేవలను గౌరవించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన విలేకరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య పథకం కొనసాగించాలని.

చిన్న, మధ్య తరగతి పత్రికలు, ఉర్దూ జర్నలిస్టులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇండ్ల స్థలాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.రాష్ట్ర కార్యదర్శి రాంనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వాల హితమే కాకుండా విలేకరుల హక్కుల కోసం సంఘం ఎల్లప్పుడూ పోరాడుతోంది.

పదవులు మాకవి కావు... గౌరవం, మౌలిక వసతులే కావాలని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు గట్టిగా ముందుకు రావాలన్నదే ఈ యూనియన్ ఉద్దేశ్యం అన్నారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులుగా విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ కుమార్ లను ఏకగ్రీవంగాఎన్నుకున్నారు.