calender_icon.png 9 October, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీల చక్రబంధనంలో గ్రామాలు

08-10-2025 12:00:00 AM

- అతివేగం, హారన్ల మోతతో హడల్

- డ్రైవర్ల అజాగ్రత్తతో నిత్యం ప్రమాదాలు

- లారీల రాకపోకలతో ఛిద్రమైపోతున్న రోడ్లు

- వాహనదారులు, గ్రామస్తుల అవస్థలు

- రోడ్డు పైకి రావాలంటేనే జంకుతున్న జనం 

- పట్టింపులేని అధికారులు

మణుగూరు, అక్టోబర్ 7 (విజయక్రాం తి) : తలాపునా గోదావరి నది ఉందన్న సం బరం కంటే, ఇసుకను తరలిస్తున్న వందలా ది లారీలతో నిత్యం ఆయా గ్రామాల ప్రజ లు హడాలి పోతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిదన్నట్టుగా ఉంది ఆ గ్రామాల ప్రజల పరిస్థితి. సర్కారు ఆదాయం ఏమో కానీ అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. గతంలో వర్షాకాలంలో మాత్రమే జలదిగ్బంధనంలో చిక్కుకునే ఆ పల్లెలు నేడు లారీల దిగ్భంధనంలో చిక్కుకపోయాయి.కమలాపురం, క ట్టు మల్లారం గ్రామస్తులు వారి ఇబ్బందులపై విజయక్రాంతి అందిస్తున్న కథనం..

అతివేగం, హారన్ల మోతతో..

కమలాపురం, చిన్నరాయి గూడెం గ్రా మాలకు చెందిన ఇసుక క్వారీల నుండి వం దల సంఖ్యలో లారీలు కమలాపురం, కట్టు మల్లారం గ్రామాల మీదుగా రవాణా సాగు తూ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక లారీల హరన్లతో పల్లెలు ఉలిక్కిపడు తుండగా ప్ర భుత్వం రూ. కోట్ల ప్రజాధనంతో వేసిన రో డ్లు ధ్వంసం అవుతున్నాయి. ప్రమాద కరం గా మారిన రోడ్లపై జనం ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ ప్రయా ణం చేస్తున్నారు. రోడ్డుపై ఎక్కాలంటే భయ పడుతున్నారు. క్షణం క్షణం భయం భయం గా కాలం వెళ్లదీస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరాయంగా భారీ వా హనా లతో ఇష్టాను సారంగా ఇసుకను తరలిస్తు ఇసుక రీచ్ నిర్వాహకులు ఊర్లను వల్లకాడుగా మారుస్తున్నారు.

లారీలతో అవస్థలు...

ఒకటా రెండా.. ఒకే సారి వందలాది లారీ లు మధ్య చిక్కుకపోయి విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లే కూలీలు, సకాలంలో గమ్యం చేరు కోలేకపోతున్నారు. అనారోగ్యం బారిన పడిన వారు చికిత్స కోసం మండల కేంద్రానికి వెల్లడానికి కూడా నరకం అనుభవి స్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే వాహనాలు కూడా ఈ లారీల కార ణంగా ఎక్కడికక్కడ స్తంభించి పోతున్నాయి. దీంతో విద్యార్థులు 100కు డయల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటే ఇక్కడ ఇసుక లారీల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవచ్చు. వీటి కారణంగా బైకులపై ప్రయాణించే వీలు కూడా లేకుండా పోయిందని ఆయా గ్రామా ల ప్రజ లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. 

రోడ్డు పైకి రావాలంటేనే జంకుతున్న జనం

లారీల వేగానికి మూగజీవాల సైతం ప్రమాదాల బారిన పడు తున్నాయి. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. కానీ ఇసుక క్వారీ నిర్వాహకుల తీరు ఏ మాత్రం మారడం లేదు. క్వారీల వద్ద లారీల నిర్వహణకు పార్కింగ్ స్థలా న్ని ప్రత్యేకంగా కేటాయించినట్లు రికార్డుల్లో పేర్కొంటున్న క్వారీ నిర్వాహకులు వాస్తవంలో ఆ నిబంధనను పాటించ కుండా రహదారిపై పదుల సంఖ్య లో లారీలను నిలపడం మూలంగా తీవ్ర మైన ట్రాఫిక్ సమస్య ఉత్ప న్నమవుతుంది. మరో పక్క పదుల సంఖ్యలో ఇసుకలారీలు హారన్ల తో రాత్రివేళ నిద్రకుదూర మవుతున్నామని, గోదావరి చెంతనే ఉండటమే మేము చేసుకున్న పాపమా అని పాలకులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్న లారీ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ అధికారిని వివరణ కోరేందుకు విజయ క్రాంతి ప్రయత్నించగా ఆయన చరవాణి సైతం స్విచాఫ్ వస్తుంది. .