18-05-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, మే 17:: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం నాద ముద్ర స్కూల్ అఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ గురువు చైతన్య కుసుమ ప్రియా శిష్య బృందంచే భారతనాట్య ప్రదర్శనలో గణేశా పంచరత్న, కౌతం, శృంగార లహరి, సప్తతాండవం, సూర్యాష్టకం, అర్ధనారీశ్వరాష్టకం, తిల్లాన, మంగళం అంశాలను రీతూపర్ణ, లాశ్రీత సాయి, హరిణి, అనన్య, తరిని, నిహారిక, మానస, శ్రీలత, డాక్టర్ ఆనంద్ మీనన్, రమ్య ప్రదీప్‌లు ప్రదర్శించి మెప్పించారు.
అనంతరం డాక్టర్ శ్రిష్టి బుధోరి నాట్య ప్రదర్శనలో దశావతరం, తిల్లాన, విషమ కార ణాన, జగదోదరణ వంటి అంశాలను ప్రదర్శించి సందర్శకులను ఎంతగానో మెప్పిం చారు. గత రెండు వారాల నుండి శిల్పారామంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఆర్ట్ క్యాం పు నేటితో ముగిసింది. పిల్లలు పెద్దవాళ్లు అందరు ఇప్పటివరకు నేర్చుకున్నవి అన్ని ప్ర దర్శించారు. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు ఐఏఎస్ విచ్చేసి పోటీల్లో పా ల్గొని విజేతలుగా నిలిచిన కళాకారులకు అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.