22-11-2025 12:00:00 AM
నిజాంసాగర్ నవంబర్ 21 (విజయ క్రాంతి): విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించాలని నిజాంసాగర్ మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అచ్చంపేటలో నిర్వహించిన ప్రాథమిక పాఠశాలల సముదాయాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యా సామర్ధ్యాలను పెంపొందించుటకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు.
ప్రగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫండమెంటల్ లెర్నింగ్ సర్వే కు విద్యార్థుల యొక్క తరగతి బోధన చేయాలని సూచించారు. మూడవ తరగతి చదువుతున్న విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి వారిని బి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులను ఏ గ్రేడ్లకు వచ్చేలాగా కృషి చేయాలన్నారు.
అదేవిధంగా సి గ్రేడ్ లో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయులచే బోధన చేయాలని ఆయన అన్నారు. అనంతరం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు బి వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ తప్పకుండా వేసుకోవాలని అదేవిధంగా విద్యార్థుల యొక్క అటెండెన్స్ రోజు 10 గంటల లోపు తీసుకోవాలని సూచించారు. చాలా రోజులుగా పాఠశాలకు రాని విద్యార్థులను గుర్తించి వారికి పాఠశాలలో చేర్పించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని ఆయన అన్నారు.యుడైస్ వ్బుసైట్లో పాటశాల వివరాలను సరిచూసుకొని పొందుపరచాలని సూచించారు.
తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను గుర్తించి వారి వివరాలను ఆన్లున్ చేయాలని ఆయన అన్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.వెంకటేశం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని ఆయన సూచించారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులతో వంటగదిలను శుభ్రపరచాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిఆర్పి లు బింగి. శ్రీధర్ కుమార్, పల్లపు నర్సింలు, ఎం, వరలక్ష్మి, అచ్చంపేట్, నిజాంసాగర్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.