calender_icon.png 17 August, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిటెక్నిక్‌పై విద్యార్థుల అనాసక్తి

14-08-2025 01:36:30 AM

ఖాళీగా మిగిలిపోనున్న సీట్లు

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి):  రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులకు రాను రాను క్రేజ్ తగ్గుతోంది.. పాలిటెక్నిక్ చేసేందుకు విద్యార్థులు ఇష్టపడటంలేదు. దీంతో దాదాపు సగం సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి.

మరోవైపు ఈసారి కౌన్సిలింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను ఆలస్యంగా విడుదల చేయడంతోపాటు ఈసారి ఫీజులను కూడా పెంచడంతో ఎక్కువ మంది విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులో చేరకుండా ఇంటర్ వైపు మొగ్గుచూపుతున్నారు. 

పాలిసెట్ ఫైనల్ ఫేజ్ సీట్లను జూలై 28న కేటాయించారు. ఆతర్వాత ఆగస్టు 5న ఇంటర్నల్ స్లుడింగ్‌ను నిర్వహించారు. మొత్తం రాష్ట్రంలో 115 కాలేజీలుండగా అందులో 59 ప్రభుత్వ, 56 ప్రైవేట్ కాలేజీలున్నాయి. 59 ప్రభుత్వ కాలేజీల్లో 14,209 సీట్లుండగా వీటిలో 9,962 సీట్లు మాత్రమే భర్తీ కాగా 4,247 (70.1శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. 56 ప్రైవేట్ కాలేజీల్లో 15,240 సీట్లకు గానూ 6,496 (42.6 శాతం) సీట్లు నిండగా, 8,744 సీట్లు మిగిలాయి. మొత్తంగా 29,449 సీట్లలో 16,458 (55.8 శాతం) సీట్లు భర్తీకాగా, ఇంకా 12,991 (44.2 శాతం) సీట్లు ఖాళీగా మిగిలాయి. 

ప్రైవేట్ కాలేజీల్లో కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే సీట్లు అత్యధికంగా నిండాయి. ఈసారి ఫీజులు కూడా పెరగడంతో విద్యార్థులపై భారం పడనుం ది. రూ.14,900 ఉన్న ఫీజును చాలా కాలేజీల్లో రూ.39 వేలకు చేరింది.