05-11-2025 02:02:23 AM
కొత్తపల్లి, నవంబరు 4 (విజయ క్రాంతి): నగరంలోని మంకమ్మతోటలోని పారమిత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి రీడ్ ఇండియా సెలబ్రేషన్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. పాఠశాల చెందిన రాచమల్ల ఆద్య, గాదం సుధీక్ష లు రీడ్ ఇండియా సెలబ్రేషన్ అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొని రెండవ రౌండ్ కు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానో పాధ్యాయులు బాలాజి తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల అధినేత డా ఇనుగంటి ప్రసాదరావు పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రశ్మిత, వినోదరావు, వి. యు.ఎం ప్రసాద్, హనుమంతరా వు, ప్రధానోపాధ్యాయులు బాలాజీ, ప్రశాం త్, కవిత, సమన్వయ కర్త శ్రీనాథ్, గైడ్ టీచర్ చంద్రసేన, ఉపాధ్యాయులుఅభినందించారు.