calender_icon.png 30 August, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి

30-08-2025 02:03:24 AM

విద్యా డైరెక్టర్‌కు గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం వినతి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల పదోన్నతుల కారణం గా పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడిందని, చాలా స్కూళ్లలో ఏర్పడిన ఖాళీల్లో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ కోరింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌ను అసోసియేషన్ అధ్య క్షుడు పీ.రాజభాను చంద్రప్రకాష్, ప్రధానకార్యదర్శి జీ.హేమ చంద్రుడు శుక్రవారం కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ పదోన్నతుల వల్ల కొన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా, మరికొన్ని ఖాళీలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీంతో  విద్యార్థులకు విద్యాపరమైన బోధన అంతరాయం, నష్టం జరగకుండా టీచర్లను కేటాయించాలని కోరారు.  గతంలో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయులను యథా స్థితికి పంపిచాలని విజ్ఞప్తి చేశారు. టీచర్ల సర్దుబాటు అనంతరం మిగిలిన ఖాళీలను డీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, అంతవరకు అవసరమైన చోట విద్యా వా లంటీర్లను నియమించాలని తెలిపారు.