30-08-2025 02:04:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హయత్‌నగర్ కోర్టులో వినాయక పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హైకోర్టు అడ్వొకేట్ వీరమళ్ల రామ్ నరసింహాగౌడ్, 7వ అడిషనల్ జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోడెం ప్రభాకర్ గౌడ్, ఇతర న్యాయవాదులతో కలిసి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తితో కొలిచినట్టు వారు పేర్కొన్నారు.