12-07-2025 12:31:51 AM
జీసీడీఓ శకుంతల
బెజ్జూర్, జూలై 11 (విజయక్రాంతి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జీసీడీఓ శకుంతల వార్డెన్ శ్రీనివాస్‌కు సూచించారు. బెజ్జూర్ మండలం లోని కుంటల మాలపల్లి,బెజ్జూర్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను జీసీడీఓ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు పలు రికార్డులను పరిశీలించారు.
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల వసతుల గురించి అడిగి తెలుసుకు న్నారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి మెనూలో కోడిగుడ్డు వడ్డించాల్సి ఉండగా ఎందుకు విద్యార్థులకు ఎందుకు అందించడం లేదని వార్డెన్ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. ఒకవేళ సరఫరా కాకపోతే విద్యా ర్థుల కోసం ప్రైవేటులో కొనుగోలు చేసి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.
కోడిగుడ్ల సరఫరా విషయమై జీసీడీఓ సదరు కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని మెనో ప్రకారం తప్పనిసరిగా భోజనం విద్యార్థిలకు అందించేలా చూడాలని వార్డెన్ కు ఆదేశించారు. విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హాస్టల్లో సమస్యల గురించి అడిగి తెలుసుకుని నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. ఆమె వెంట ఎస్‌ఆర్పి వెంకటేశ్వర్, ఉపాధ్యాయులున్నారు.