calender_icon.png 8 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంగ్లభాషపై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి

07-01-2026 12:00:00 AM

హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ 

హనుమకొండ టౌన్, జనవరి 6 (విజయక్రాంతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి విద్యార్థి ఆంగ్లభాషపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సేబరీష్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్, ఎంఈఓ నెహ్రు, ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డీసీసీ బ్యాంక్ కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

హనుమకొండ, జనవరి 6 (విజయక్రాంతి): జిల్లా సహకార పరపతి బ్యాంక్ (డిసిసిబి ) కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని  హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండలోని డిసిసి బ్యాంక్‌ను డిసిసిబి చైర్ పర్సన్ హోదాలో కలెక్టర్  బ్యాంకు ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్ట ప్రకారం నిర్వహించాలని, బ్యాంక్ యొక్క పెర్ఫార్మెన్స్ ను పెంచుతూ పోవాలని, బ్యాంక్ సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలని అన్నారు. డిసిసిబి బ్యాంక్ పరిధిలోని జిల్లా సహకార శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ  డిసిఓ సంజీవ రెడ్డి, జనగామ డిసిఓ కోదండరాం, డిసిఓ జయశంకర్ భూపాలపల్లి వాలు నాయక్, వరంగల్ డిసిఓ నీరజ , బ్యాంక్ సి ఈ ఓ వజీర్ సుల్తాన్, డిపిఎం అశోక్, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.