12-07-2025 02:03:14 AM
ఖైరతాబాద్, జూలై 11 (విజయ క్రాంతి) : పాలిసెట్ లో విద్యార్థుల డేటా తారుమారు విషయంలో అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏబీవీపీ) హైదరాబాద్ నగర సెక్రెటరీ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోనిటీఎస్ ఎస్‌బీటీఈటీ కార్యాలయం ముందు ధర్నను నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
రాష్ట్రంలో దాదాపు 22 వేల మంది విద్యార్థులు రాసిన పాలిసెట్ లో జరిగిన అవకతవకల వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. ఈనెల 4న జరగాల్సిన పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు ఇప్పటివరకు జరగకపోవడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.మెరిట్ విద్యార్థులు కష్టపడి రాసిన పరీక్షను ఇలా డేటా మాయం అవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు .
డేటా మాయం వెనుక ఉన్న వారిని వెంటనే శిక్షించాలని అన్నారు. ఇంత జరిగిన అధికారులు దీని మీద స్పందించకపోవడం సిగ్గు చేయటానికి తెలిపారు.అధికారులను అడిగితే సాంకేతిక సమస్య అని ఒకసారి, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య అని ఒకసారి మాయమాటలు చెపుతూ బుగ్గ ఇస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి దీని పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ ఘటనపై వెంటనే అధికారులు పూర్తి నివేదికను మీడియా ముఖంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు .వెంటనే పాలిసెట్ రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు, ఉప్పల్ జిల్లా కన్వీనర్ అఖిల్, మణికంఠ, సంతోష్, లోకేష్, సాయి భాను తదితరులు పాల్గొన్నారు.