విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,జనవరి 2(విజయ క్రాంతి) : విద్యార్థులు చదువుతో పా టు క్రీడలలో రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి పాల్గొన్నా రు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత చలి తీవ్రత దృష్ట్యా వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో దుప్పట్లు అందించడం అభినందనీయమని తెలిపారు. ఇటీవ ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రపంచ విఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు మెస్సి తో కలిసి ఆడిన ఫుట్ బాల్ పోటీలో పాల్గొన్న గురుకుల పాఠశాల విద్యార్థినిని అభినందించారు. విద్యార్థులకు అందించవలసిన దుస్తు లు, కాస్మోటిక్ చార్జీల వివరాలు తెలుసుకొని విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని తెలిపారు.
చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పై దృష్టి సారించాలని, విద్యార్థినులను వార్షిక పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేయాలని, అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థినులు చదువులో రాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలి పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఆసిఫాబాద్ ఇన్చార్జ్ ఎడిఎ మిలింద్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






