16 April, 2026 | 6:00 AM

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

03-01-2026 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

చెన్నూర్, జనవరి 2 : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం చెన్నూర్ మండ లం కిష్టంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలలను విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపా రు.

ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం చెన్నూర్ మండల కేంద్రం లోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. తహసిల్దార్ కార్యాల యాన్ని తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి సందర్శించారు. వివిధ భూ సమస్యలపై భూభారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.