calender_icon.png 26 November, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి

25-11-2025 12:00:00 AM

ఉప్పల్, నవంబర్ 24 (విజయక్రాంతి) : చట్టాలపై విద్యార్థులు అవగాహన పెం చుకోవాలని నాచారం సబ్ ఇన్‌స్పెక్టర్ మైబల్లి ప్రభాకర్ రెడ్డి అన్నారు సోమవారం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని  నాచారం చౌరస్తాలో ఉన్న తెలంగాణ మైనార్టీ స్కూ ల్ మరియు జూనియర్ కాలేజ్‌లో పోలీస్ అవగాహన సద స్సు వారు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరు ప్రజలకు అందించే సేవ లు సైబర్ నేరాల పట్ల నివారణ పద్ధతులు షీ టీం డయల్ 100 వంటి సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మంలో కాలేజీ అధ్యాపకులు నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పెట్రోలింగ్ మొబైల్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.