calender_icon.png 28 July, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

25-07-2025 02:18:51 AM

జముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్, జూలై 24 (విజయక్రాంతి):  విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు గురువారం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు  జన్మదినం  సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో వివిధ డివిజన్లో ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సీనియర్ బిఆర్‌ఎస్ నాయకులు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు.

గాంధీనగర్ డివిజన్ లలితా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు, సహారా బేకరీ ఎదురుగా సీనియర్ నాయకులు ముఠా నరేష్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. భోలక్ పూర్ ఎస్బిఐ కాలనీలో డివిజన్ ప్రెసిడెంట్ వై. శ్రీనివాస్ రావు  ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కవాడిగూడ డివిజన్ ఇందిరాపార్క్ చౌరస్తాలో డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కేటీఆర్ కు తమ నియోజకవర్గం నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ర్ట యువ నాయకులు ముఠా జై సింహ, వివిధ డివిజన్ల  ప్రెసిడెంట్లు శ్రీధర్ రెడ్డి, శంకర్ ముదిరాజ్ కార్యదర్శులు ఆకుల అరుణ్ కుమార్, శ్రీకాంత్, సాయి కృష్ణ, సీనియర్ నాయకులు, టెంట్ హౌస్ శీను, శ్రీధర్ చారి, దీన్ దయాల్ రెడ్డి, బిక్షపతి యాదవ్, శ్రీధర్ గౌడ్, వెంకటేష్, ఎయిర్టెల్ రాజు, శ్రీనివాస్, బియ్యం శీను, జావిద్ ఖాన్, సత్యనారాయణ బాబు, ముషీరాబాద్ మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, సాయి చాణిక్య రెడ్డి, ముచ్చకుర్తి పద్మ, అనిల్, శంకర్ గౌడ్, ఉమాకాంత్, కృష్ణ, కె ఎం సాయి, క్రాంతి, కళ్యాణ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, శ్రీహరి, ప్రవీణ్, ముఖేష్ రెడ్డి, వల్లాల రవి వల్ల రవి, శ్రీకాంత్, సందీప్, లక్ష్మీనారాయణ, నరేష్, మాధవి, రూప, మంజుల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.