18-11-2025 12:00:00 AM
-దానం చేసినవి.. దర్జాగా అమ్ముకుండ్రు అనే
-కథనానికి స్పందన
-మరో 12వేలతో సోమవారం పాఠశాలకు బీరువాలు రాక
-మళ్లీ మళ్లీ అడగకూడదు : సీసీ కుంట మండలం జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి
చిన్నచింత కుంట, నవంబర్ 17: బాధ్యత గల హోదాలో ఉండి అడిగితేనే గుర్తుకు వస్తున్నాయి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వెనుక ఉన్న అంతర్వేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అసలు పాఠశాల కమిటీ తీర్మానం చేసి ఆ పాఠశాలలో పురాతన వస్తువులైన మరేవైనా విక్రయించాలి అంటూ నిబంధనలు చెబుతున్నాయి.
అవేమి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సొంత మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దాదాపుగా 250కి పైగా డిఎల్ బెంచీలను ఇలాంటి కమిటీల నిర్ణయం లేకుండానే ఓ ఇనుప సామాను వ్యాపారికి విక్రయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన విజయ క్రాంతి దినపత్రిక సోమవారం దానం చేసినవి దర్జాగా అమ్ముకుంటారు అనే కథనం ప్రచురితం చేసింది.
కథనం ప్రచురితమైన సోమవారం రోజున మరోసారి విజయక్రాంతి దినపత్రిక విలేఖరి ప్రధాన ఉపాధ్యాయురాలను సంప్రదించారు. పాఠశాలలోని డ్యూయల్ బెంచీల ను విక్రయించడంతో వచ్చిన డబ్బులను చూసుకో ఒక 6,500 మాత్రమే వచ్చాయని మరో మరో కొనుగోలు చేసిన వ్యక్తిని అడగగా మరో రూ 12000 ఇవ్వడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విక్రయించిన డ్యూయల్ బెంచ్ లకు ఒకేసారి మొత్తం తీసుకోకుండా అడిగితేనే గుర్తుకు వచ్చేయడం ఉన్న అంతర్వేమిటని పలువురు చర్చించుకుంటున్నారు.
డ్యూయల్ బెంచీల డబ్బులతో ఒక మిషన్, రెండు బీరువాలు
పాఠశాలకు దానం చేసిన డిఎల్ బెంచ్ లను విక్రయించి ముందుగా కేవలం రూ 6500 మాత్రమే వచ్చాయని చెప్పినప్పటికీ విజయక్రాంతి దినపత్రికలో కథనం వెలబడడంతో మరో రూ 12 వే లు వచ్చాయంటూ రెండు బీరువాలను సోమవారం తెప్పించారు. మరోరూ 6,500లతో ఒక కుట్టు మిషన్ కూడా పాఠశాల కొనుగోలు చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు డ్యూయల్ బెంచ్ లకు వచ్చిన డబ్బులు ఎన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్న మాట.
ఈ విషయంపై ఎంఈఓ మురళీకృష్ణ ఇప్పటికే విచారణ చేస్తున్నామని చెప్పడం వెన్ను వెంటనే రెండు బీరువాలు ఒక మిషన్ రావడంతో విజయ క్రాంతి దినపత్రిక రాసిన కథనానికి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తుండ్రు. నియమ నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించకూడదని దానం చేసిన డ్యూయల్ బెంచీలు మరో పాఠశాలకు దానం చేస్తే తప్పేముందని మరింత మంది గ్రామస్తులు చెబుతున్న మాట.
మళ్లీ మళ్లీ అడగకూడదు...
మీరు రిపోర్టర్ అయినా మీ ఐడి కార్డు చూయించండి. డ్యూయల్ బెంచీలకు సంబంధించి ఒకసారి అడిగారు 6,500 వచ్చాయని చెప్పాము. మీరు అడిగిన తర్వాత మరో మారు నాకు గుర్తుకు వచ్చి కొనుగోలు చేసిన వ్యక్తిని అడగగా మరో రూ .12 వేల ఇచ్చారు. ఈ డబ్బులతో ఒక కుట్టు మిషన్, రెండు బీరువాలను తెప్పించడం జరిగింది. మళ్లీ మళ్లీ అడగకూడదని చెబుతున్నాను. దసరా సెలవులలో విక్రయించడం జరిగింది. కరెక్ట్ గా ఎన్ని బెంచీలను విక్రయించడం జరిగింది నాకు తెలియదు. వచ్చిన డబ్బులను ఒక మరో స్కావెంజర్లకు ఇవ్వడం కూడా జరిగింది.
మాదవి, ప్రధానోపాధ్యాయురాలు, జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల, చిన్న చింత కుంట మండలం,