calender_icon.png 18 September, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్లను కేటాయించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

18-09-2025 12:22:03 AM

అంతర్ రాష్ట్ర రహదారిపై విద్యార్థులు ఆందోళన

గద్వాల జిల్లా బొంకూరులో ఘటన 

అలంపూర్ ,సెప్టెంబర్ 17: తాము చదువుకుంటున్న పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా చదువులు ఆగమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని వెంటనే టీచర్లను కేటాయించాలని జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.ఒకపక్క ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో అధికారులు ,ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాలు ఎగర వేసి సంబరాలు జరుపుకుంటున్నారు.మరోపక్క పుస్తకాలు చేత పట్టి చదువుకోవాల్సిన విద్యార్థులు..ఆ చదువులు చెప్పే గురువుల కోసం ప్లకార్డులు పట్టుకుని రోడ్డెక్కి ధర్నా చేపట్టారు.

ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు గ్రామం వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై బుధవారం చోటుచేసుకుంది.గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో దాదాపు అన్ని తరగతులను కలుపుకుని 274 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.వీరికి కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే విద్యా బోధన చేస్తున్నారు. గణితం, బయోసైన్స్ సోషల్ వంటి ప్రధాన సబ్జెక్టులకు టీచర్లు లేరు.ప్రతి ఏడాది స్కూల్ ప్రారంభంలో డిప్యూటేషన్ పై టీచర్లు వచ్చే వారని ఈ ఏడాది స్కూలు ప్రారంభమై నాలుగు నెలలు గడిచిన టీచర్లు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈ విషయమై ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులకు టీచర్లను కేటాయించాలని పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా విషయం తెలుసుకున్న ఎంఈఓ శివప్రసాద్ ధర్నా చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు.ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేపట్టే క్రమంలో కర్నూలు - రాయచూరు అంతర్ రాష్ట్ర రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.